వరంగల్ మేయర్ ఎన్నికపై టీఆర్ఎస్ కసరత్తు

 వరంగల్ మేయర్ ఎన్నికపై టీఆర్ఎస్ కసరత్తు

ఈనెల 27న జరగనున్న గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ మేయర్‌ ఎన్నికపై టీఆర్‌ఎస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎన్నిక ఇంఛార్జ్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లును సీఎం కేసీఆర్‌ నియమించారు. స్థానిక సీనియర్‌ నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి బాలమల్లు నివేదిక అందిస్తారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.