తెలంగాణలో టీఆర్ఎస్ దే విజయం

తెలంగాణలో టీఆర్ఎస్ దే విజయం

తెలంగాణలో మరోమారు గులాబీ పార్టీ హవా కొనసాగునుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.14 నుంచి 16 లోక్ సభ స్ధానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని లగడపాటి రాజగోపాల్ సర్వే తెలిపింది. తెలంగాణలో అలాగే 17 లోక్‌సభ స్థానాలకు గానూ 14 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తలో ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని సీ-ఓటర్ వెల్లడించింది. టీఆర్ఎస్ 12 నుంచి 14, కాంగ్రెస్ 1-2, బీజేపీ 1-2, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటుందని న్యూస్-18 ప్రకటించింది.