సీట్లు పోయినా ఓట్ల పెరిగాయి..!

సీట్లు పోయినా ఓట్ల పెరిగాయి..!

లోక్‌సభ ఎన్నికల్లో మా సీట్లు పోయినా... ఓట్ల శాతం మాత్రం పెరిగిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 2014 లోకసభ ఎన్నికల్లో 34 శాతం ఓట్లు వచ్చాయి.. ఈసారి 6 శాతం ఓట్లు పెరిగాయని ఆయన మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. 16 ఎంపీ సీట్ల కోసం గట్టి ప్రయత్నం చేశాం... ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ఇక మల్కాజిగిరిలో వెంట్రుకవాసితో కాంగ్రెస్ గెలిచింది. అందులో ఘనం ఏమీలేదన్న కేటీఆర్.. మరోవైపు నరేంద్ర మోడీ హవాతో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చాయన్నారు. 17 సీట్లలో 10 మేం గెలిచామన్న ఆయన... ఆదిలాబాద్ లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ కూడా ఊహించలేదన్నారు. విచిత్రమైన ట్రెండ్ మొన్నటి లోకసభ ఎన్నికల్లో కనిపించిందని.. వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం వల్ల మా పార్టీపై ఏమైనా ప్రభావం ఉందేమో చూస్తామన్నారు. లోకసభ ఎన్నికల ఫలితాలు మాకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్‌గా భావిస్తామన్న కేటీఆర్... బీజేపీ వాళ్లకు ఈ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా పేర్కొన్నారు. మేం లోకసభ ఎన్నికల్లో కష్టపడినంత ఏ పార్టీ చేయలేదన్న ఆయన.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఫలితాలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వరంగల్ లో మాకు వచ్చిన మెజార్టీ... బీజేపీ, కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులు కంటే ఎక్కువగా ఉందన్నారు.