అంబేద్కర్‌ అందరి నాయకుడు.. పంజాగుట్ట ఘటన బాధాకరం..

అంబేద్కర్‌ అందరి నాయకుడు.. పంజాగుట్ట ఘటన బాధాకరం..

అంబేద్కర్ అనగానే ఒక వర్గానికి చెందిన నాయకుడు అనడం సరికాదు... ఆయన అందరి నేత అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బాబాసాహెబ్ డాక్టార్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన... అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ చొరవతో పార్లమెంటులో బిల్లుతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మైనార్టీల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తుచేసిన కేటీఆర్.. అంబేద్కర్ తత్వంతో కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. అంబేద్కర్ తత్వం భారతదేశానికి ఇప్పుడు ఎంతో అవసరం ఉందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్... అంబేద్కర్ కొందరి నాయకుడు కాదు.. అందరి నాయకుడని.. అల్పసంఖ్యాకులకు ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నారు. ఇక నిన్న జరిగిన పంజాగుట్ట ఘటనపై స్పందించిన కేటీఆర్.. ఆ ఘటన బాధాకరమన్నారు. పంజాగుట్ట ఘటన విషయంలో ప్రభుత్వం బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. కాగా, పంజాగుట్టలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ తొలగించడం.. డంపింగ్ యాడ్‌లో చెత్తలో పడవేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.