కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ లంచ్..!

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ లంచ్..!

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరతామంటూ ప్రకటించిన 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఓవైపు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసే ప్రక్రియ మరోసారి ఊపందుకోగా... ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వరరావు, గండ్ర వెంకట రమణ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సురేందర్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, తాజాగా ఎన్నికైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరైయ్యారు. మరోవైపు కారెక్కడానికి సిద్ధమైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా ప్రగతి భవన్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ లంచ్ భేటీలో విలీన ప్రక్రియపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది.