అసదుద్దీన్‌తో కేటీఆర్ చర్చలు..

అసదుద్దీన్‌తో కేటీఆర్ చర్చలు..

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమావేశమయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఒవైసీ ఇంటికి వెళ్లిన కేటీఆర్... ఆయనతో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లపై చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా... హైదరాబాద్‌లో ఎంఐఎం, మిగతా 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం  సాధిస్తుందని... ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత, హరీష్‌రావు... తదితరులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం సహకారం ఇచ్చిపుచ్చుకున్న టీఆర్ఎస్, ఎంఐఎం... లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి ముందుకు వెళ్లనున్నాయి.