నేడు టీఆర్ఎస్‌ ఎల్పీ కీలక భేటీ..

నేడు టీఆర్ఎస్‌ ఎల్పీ కీలక భేటీ..

ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాసన సభాపక్షం సమావేశం కానుంది... ఉదయం 11.30 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్‌తో అవగాహన కల్పించనుంది టీఆర్ఎస్. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి ఐదుగురు అభ్యర్థులను బరిలోకి దింపిన అధికారపక్షం.. అందరినీ గెలిపించుకునే విధంగా పావులు కదుపుతోంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ ఇప్పటికే దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరతారనే చర్చ కూడా సాగుతుండగా... ఐదు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుటుందని భావిస్తున్నారు.