కమలా హారిస్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు... 

 కమలా హారిస్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు... 

అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా భారతీయ సంతతిరాలు కమలా హారిస్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే కమలా హారిస్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హారిస్‌కు అమెరికా ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసే అర్హత లేదని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వలసవచ్చిన వారికి కమలా హారిస్ జన్మించిందని, అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆమెకు ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసే అర్హత లేదని ఇటీవల ఓ మేటి కన్జర్వేటివ్ న్యాయవాది పేర్కొన్నారు. కమలా జననంపై వివాదాం నెలకొన్న నేపథ్యంలో వైట్‌హౌజ్‌లో ఈ అంశంపై ట్రంప్ మాట్లాడారు. ఉపాధ్యక్షురాలిగా అయ్యే అర్హత కమలాకు లేదని, ఆమె అర్హత గురించి కన్జర్వేటివ్ న్యాయవాది ప్రశ్నించారని ట్రంప్ తెలిపారు. ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసే ముందు డెమోక్రాట్లు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుండేదన్నారు. ఆమె ఈ దేశంలో పుట్టలేదు కాబట్టి ఆమెకు అర్హత లేదని ట్రంప్ తెలిపారు.