అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ!

అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ!

అమెరికాలో మళ్లీ నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌. శత్రువుల నుంచి కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ట్రంప్‌ తాజా నిర్ణయంతో జాతీయ భద్రత కోసం అమెరికా కంపెనీలు విదేశీ టెలికమ్‌ సేవలను వినియోగించకుండా అడ్డుకట్ట పడింది. విదేశీ కంపెనీలు కూడా అమెరికా కంపెనీల నుంచి నెట్‌వర్క్ పరికరాలను కొనాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి కచ్చితంగా ఉండాలి. ట్రంప్‌ వెల్లడించనప్పటికీ.. చైనాకు చెందిన 'హువాయ్‌' సంస్థ లక్ష్యంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.  ట్రంప్‌ చర్యతో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు ఘోరంగా  దెబ్బతినే ప్రమాదం ఉంది.