రెండోసారి ట్రంప్ అందుకే అధికారంలోకి రావాలనుకుంటున్నాడా?

రెండోసారి ట్రంప్ అందుకే అధికారంలోకి రావాలనుకుంటున్నాడా?

నవంబర్ 3 వ తేదీన అమెరికా అధ్యక్షపదవికి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఎన్నికల సమయందగ్గర పడుతుండటంతో ప్రచారంలో వేగం పెరిగింది.  వాడివేడి విమర్శలు పెరిగాయి.  అమెరికన్ ప్రజలు తనవైపే ఉన్నారని ట్రంప్ పదేపదే చెప్తున్నాడు.  జో బైడెన్ కు మద్దతు ఇస్తే దేశాన్ని చైనా చేతుల్లో పెడతాడని ట్రంప్ విమర్శలు చేస్తున్నారు.  జో బైడెన్ సైతం అధ్యక్షుడు ట్రంప్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.  జో తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగాడు ట్రంప్ పై విమర్శనాస్త్రాలు గుప్పించారు.  తన స్వార్ధ ప్రయోజనాల కోసం,  తన సంపన్న మిత్రుల ప్రయోజనాల కోసమే ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావాలని అనుకుంటున్నారని, కరోనాను ఎదుర్కొనడానికి ట్రంప్ దగ్గర సరైన ప్రణాళికలు లేవని బరాక్ ఒబామా విమర్శించారు. సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం ట్రంప్ కు లేదని ఒబామా ఎద్దేవా చేశారు.