జక్కన్న వెళ్లి ట్రంప్ కి అది ఇవ్వాలి : వర్మ

జక్కన్న వెళ్లి ట్రంప్ కి అది ఇవ్వాలి : వర్మ

రామ్ గోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే... ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలియదు. అయితే నిత్యం సమాజం లోని విషయాల పైన స్పందించే వర్మ ప్రస్తుతం ఆయన ట్విట్టర్ ఖాతాను మొత్తం ట్రంప్ పై సెటైర్లు వేస్తూ నింపేస్తునాడు. అయితే ఇంతకు ముందు నమస్తే ట్రంప్ కార్యక్రమానికి కోటి మంది రావాలంటే ట్రంప్ పక్కన సన్నీలియోన్‌ ని నిలబెడితే బాగుటుంది అని అన్నాడు వర్మ. అయితే నిన్న ఆ కార్యక్రమం పూర్తి అయిన సందర్బంగా వర్మ మళ్ళీ ఓ ట్విట్ చేసాడు. వర్మ తన ట్విట్ లో ''ట్రంప్ వచ్చి రాజమౌళిని గ్రాఫిక్స్ ఉపయోగించి తన ఆ కార్యక్రమానికి వచ్చిన లక్ష మందికి కోటి మందిగా కనిపించేలా చేయాలనీ అడగాలి'' అని అన్నాడు. అంతే కాదు ట్రంప్ రాకకోసం అంత ఖర్చు పెట్టడం పై కూడా వర్మ వ్యంగ్యంగా స్పందించాడు. అయితే ఆయన వస్తున్నాడని మురికి వాడలు కనిపించకుండా కట్టిన గోడ పై కూడా వర్మ సెటైర్ వేశాడు. అసలు మురికివాడల వ్యూ ఇదని....ట్రంప్ వ్యూ ఇదని ఓ ఫొటో జత చేసి ట్వీట్ చేశాడు వర్మ. అయితే వర్మ ట్వీట్ క్షణాల్లో వైరల్ అవడమే కాదు ఆయనకు ఎవరైనా ఒకటే ఎవరిని వదిలి పెట్టాడు అని సెటైర్ వేస్తున్నారు నెటిజన్లు.