టీఎస్ దోస్త్ నోటిఫికేషన్ విడుదల

టీఎస్ దోస్త్ నోటిఫికేషన్ విడుదల

డిగ్రీ ఆన్‌లైన్ అడ్మీషన్స్ షెడ్యూల్ విడుదల చేశారు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి... రేపటి నుండి (మే 23వ) జూన్ 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్ అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజును రూ.200గా నిర్ణయించారు. ఇక వెబ్ ఆప్షన్స్ ఈ నెల 25 నుండి జూన్ 3వ తేదీ వరకు అవకాశం ఉండగా.. ఫస్ట్ లిస్ట్ సీట్ అలాట్ మెంట్స్ జూన్ 10వ తేదీన జరగనుంది. ఆన్‌లైన్ రిపోర్టింగ్ జూన్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇక రెండో దశ రిజిస్ట్రేషన్స్ జూన్ 10 నుండి 15 వరకు ఉండగా.. రెండో విడత సీట్ల కేటాయింపు జూన్ 20వ తేదీన చేస్తారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిపోర్టింగ్ జూన్ 20వ తేదీ నుంచి 25 వరకు ఉంటుందని తెలిపారు జనార్ధన్‌రెడ్డి. మూడో దశ రిజిస్ట్రేషన్ జూన్ 20 నుండి 25 వరకు చేయనుండగా.. సీట్ల కేటాయింపు జూన్ 29తేదీన చేస్తారు.. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిపోర్టింగ్ జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు చేయనున్నారు. ఇక జులై 1వ తేదీ నుండి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు జనార్ధన్‌రెడ్డి. 

దోస్త్ ద్వారా 1049 కళాశాలల్లో అడ్మిషన్స్ చేపట్టనున్నట్టు వెల్లడించారు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లింబాద్రి... మీ సేవ, మొబైల్‌తో పాటు హెల్ప్ లైన్ సెంటర్‌లలో కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థికి సీటు వచ్చిన కళాశాలలో ఆన్‌లైన్‌లోనే రిపోర్ట చేసే అవకాశం ఉందని.. విద్యార్థుల కోసం యాప్ కూడా తయారు చేసినట్టు తెలిపారు. 27 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, 20 మైనారిటీ కాలేజీలు దోస్త్‌లో లేవన్నారు. ఇక అడ్వాన్స్ సప్లిమెంటరీ విద్యార్థులకు స్పెషల్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. దోస్త్‌ ప్రక్రియలో అనైతిక చర్యలకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. అనైతిక చర్యలకు పాల్పడే కళాశాలలను కౌన్సెలింగ్ లిస్ట్ నుండి తీసి వేస్తామని తెలిపారు. ఈ సారి డిగ్రీ కాలేజ్ ల సీట్లను రివ్యూ చేస్తాం.. ఈ ఏడాది కొన్ని సీట్లు తగ్గుతాయన్నారు. ఇక కొత్త కాలేజ్ లకు ఈ సారి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.