ఇవాళే ఎంసెట్ ఫలితాలు..

ఇవాళే ఎంసెట్ ఫలితాలు..

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో ఆలసమైన తెలంగాణ ఎంసెట్‌-2019 ఫలితాలు ఇవాళ విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు ఎంసెట్ 2019 ఫలితాలను విడుదల చేస్తారని ఓ ప్రకటనలో తెలిపారు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య. కాగా, ఎంసెట్‌ ఫలితాలు ఇంటర్మీడియట్ ఫలితాలకు లింకై ఉంటాయి. ఎంసెట్‌లో ఇంటర్ మార్స్క్‌ 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇక, టీఎస్ ఎంసెట్ మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు 1.31 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 11 న ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు... మే 13 వరకు అభ్యంతరాలు స్వీకరించారు.