నేటి నుండి రైతుబంధు చెక్కుల పంపిణీ

నేటి నుండి రైతుబంధు చెక్కుల పంపిణీ

శుక్రవారం నుండి యాసంగి సీజన్‌కు సంబందించిన రైతుబంధు చెక్కులను తెలంగాణ రైతులకు అధికారులు అందజేయన్నారు. ఈ సారి కూడా ఆర్డర్ పే చెక్కులనే ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 568 మండలాలకు సంబంధించి తొమ్మిది బ్యాంకులు చెక్కుల ముద్రణ చేపట్టాయి. అయితే 18 జిల్లాల్లోని 110 మండలాల పరిధిలో పంపిణీకి అవసరమైన చెక్కులు సిద్ధమయ్యాయి. మిగతా  మండలాల చెక్కులు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో వీటిని కూడా అందించనున్నారు. చెక్కులు సిద్దమయిన 110 మండలాలకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు, టీఎస్‌కాబ్, ఏపీజీవీబీలు ముద్రించిన 11 లక్షల చెక్కులను బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు. దీంతో చెక్కుల పంపిణీని ఈ రోజు నుండి ప్ర్రారంభమవనుంది.