గడువు పెంచిన ఇంటర్ బోర్డు..

గడువు పెంచిన ఇంటర్ బోర్డు..

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు సైతం ఇంటర్ బోర్డు ముందు ఆందోళనకు దిగారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం సప్లిమెంటరీ పరీక్ష, రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుండగా... మరో రెండు రోజుల పాటు పొడిగించారు అధికారులు. అంటే ఈ నెల 27వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్ష, రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.