టీఎస్ పీఎస్సీ నుంచి మరో రెండు నోటిఫికేషన్లు

టీఎస్ పీఎస్సీ నుంచి మరో రెండు నోటిఫికేషన్లు

టీఎస్ పీఎస్సీ మరో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పురపాలక శాఖలో 50 హెల్త్ అసిస్టెంట్లు, 35 శానిటరీ ఇన్ స్పెక్టర్లు, తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ది సంస్థలో 8 ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 31వ తేది నుంచి వచ్చే అగస్టు 8వ తేది వరకు, హెల్త్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆగస్టు 3వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించాలని టీఎస్ పీఎస్సీ సూచించింది. పలు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనకు మరో మూడు రోజులు గడువు పొడిగించే అవకాశం ఉన్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.