టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్, కండక్టర్ మృతి

టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్, కండక్టర్ మృతి

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల హైవేపై టీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మితిమీరిన వేగంతో నడుపుతూ సడన్ బ్రేకులు వేస్తూ డ్రైవర్ నడిపారని.. దీంతో బస్సు మూడు పల్టీలు కొట్టిందని ప్రయాణికులు ఆరోపించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.