భయపడేది లేదు..! మేం ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేర్లం కాదు..!

భయపడేది లేదు..! మేం ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేర్లం కాదు..!

ప్రభుత్వ బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు భయపడే ప్రసక్తే లేదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి. జీతాలివ్వకపోతే దిగొస్తారనుకోవడం ప్రభుత్వ అమాయకత్వమే అవుతుందన్నారు. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అందరికీ తెలుసన్న ఆయన... ప్రజలకు కోపం సర్కారు మీదే.. కానీ. తమ మీద కాదన్నారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్న ఆయన.. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు తీసివేయడానికి ఆ ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేరులం కాదన్నారు. ఆర్టీసీని ఇతర రాష్ట్రాల రవాణా వ్యవస్థతో పోల్చడం కాదు... ఏపీఎస్‌ఆర్టీసీతో పోల్చాలని సూచించారు. అయితే, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు అశ్వద్ధామరెడ్డి.