ఆర్టీసీ కార్మికుల సమ్మె.. జేఏసీ నిర్ణయంపై ఉత్కంఠ..!

ఆర్టీసీ కార్మికుల సమ్మె.. జేఏసీ నిర్ణయంపై ఉత్కంఠ..!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె 47వ రోజుకు చేరుకుంది. సమ్మెపై ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. అఖిల పక్షం, జేఏసీ నేతలు సమావేశమై.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇక మరోవైపు ఆర్టీసీలో రూట్ పర్మిట్లపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, హైకోర్టు తీర్పు తర్వాత దీక్ష విరమించిన జేఏసీ నేతలు.. ఆ వెంటనే సడక్ బంద్, రాస్తారోకోలను వాయిదా వేశారు. మంగళవారం సమావేశమైన జేఏసీ, అఖిలపక్ష నేతలు.. సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా.. సుదీర్ఘ చర్చల తర్వాత.. సమ్మె కొనసాగుతుందని.. కోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అయితే, ఇప్పటికే జడ్జిమెంట్ కాపీ కూడా జేఏసీ నేతలకు అందినట్టుగా తెలుస్తుండగా... ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ననే ఉత్కంఠ నెలకొంది.