దారుణం...టెంపరరీ కండక్టర్ మీద డ్రైవర్ రేప్ అటెంప్ట్ !

దారుణం...టెంపరరీ కండక్టర్ మీద డ్రైవర్ రేప్ అటెంప్ట్ !

మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాత్కాలిక బస్సు డ్రైవర్, టెంపరరీ కండక్టర్ పై అత్యాచారయత్నం చేశాడు. చెన్నూర్ నుంచి మంచిర్యాలకు వస్తున్న సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. దాంతో, బస్సు చెడిపోయిందని చెప్పి అటవీప్రాంతానికి తీసుకెళ్లిన డ్రైవర్, అఘాయిత్యం చేయబోయాడు. అతన్నుంచి తప్పించుకొని బాధితురులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, దీన్ని అధికారులు గోప్యంగా ఉంచడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులు డ్రైవర్ శ్రీనివాస్ పై 354 సెక్షన్ కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే సమ్మె వలన నానా కష్టాలు పడుతూ ప్రభుత్వం ప్రయ్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంటే తాత్కాలిక డ్రైవర్ ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది...అయితే తాత్కాలిక డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.