అర్చకులపై టి.టి.డి వేటు..

అర్చకులపై టి.టి.డి వేటు..

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.  65 సంవత్సరాల వయసు దాటిన అర్చకులపై వేటు వేయాలని నిర్ణయించింది. టిటిడి తీసుకున్న నిర్ణయంతో నలుగురు ప్రధాన అర్చకులు పదవులను కోల్పోవలసి వచ్చింది.  ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో పాటు నారాయణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు తమ పదవులను కోల్పోయారు.  టిటిడి తీసుకున్న నిర్ణయం సరైనది కాదని టిటిడి అర్చకుల సంఘం మండిపడుతోంది.