టీటీడీలో క‌రోనా క‌ల‌వ‌రం.. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పాజిటివ్

టీటీడీలో క‌రోనా క‌ల‌వ‌రం.. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పాజిటివ్

క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ ముగిసి.. క్ర‌మంగా అన్‌లాక్‌లోకి అడుగుపెడుతున్న స‌మ‌యంలో.. ఆల‌యాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.. దీంతో.. క‌ళియుగ‌ప్ర‌త్య‌క్ష‌దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం కూడా తెరుచుకుంది. అయితే, ఆల‌యం తెరిచిన‌ప్ప‌ట్టి నుంచి క‌రోనా కేసులు క‌ల‌వ‌ర‌పెడుతూనే ఉన్నాయి.. ప‌లువురు అధికారులు, జీనియ‌ర్లు, పూజారాలు ఇలా పెద్ద సంఖ్య‌లోనే క‌రోనాబారిన‌ప‌డ్డారు.. తాజాగా, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డికి కూడా క‌రోనా సోకింది.. తాజాగా నిర్వ‌హించిన క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటుండ‌గా.. ఆయ‌న ఆరోగ్య‌ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. గ‌తంలో ఎంపీగా విజ‌యం సాధించిన వైవీ సుబ్బారెడ్డి.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మితులుయ్యారు. ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌రు.