టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం

ఇకపై ఫిక్స్‌డ్ డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లోనే చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఐదు వేల కోట్ల వరకు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వెసులుబాటు ఉన్నా ఆ నిబంధనను పక్కనపెట్టి కేవలం జాతీయ బ్యాంకులకే పరిమితం కావాలని బోర్డు నిర్ణయించింది. ప్రైవేటు బ్యాంకులతో పోల్చితే జాతీయ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువ. దీంతో దేవస్థానానికి వడ్డీ రూపంలో 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకులు 8.6 శాతం వడ్డీ ఇస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లుకు జాతీయ బ్యాంకులు కేవలం 6.57 శాతం మాత్రమే చెల్లిస్తున్నాయి. పాలకమండలి  ఆదేశాలతో 1400 కోట్లను సిండికేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసింది టీటీడీ. వడ్డి ఆదాయం తగ్గుముఖం పట్టడంతో బడ్జెట్ లోటును ఎలా భర్తీ చెయ్యాలో  అధికారులకు అర్ధంకావడం లేదు.