భక్తుల కోసం టీటీడీ మరో సౌకర్యం

భక్తుల కోసం టీటీడీ మరో సౌకర్యం

వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల కొండకు చేరుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా టీటీడీ ఎప్పటికప్పుడు ప్రత్యేక సౌకర్యాలు సమకూరుస్తోంది. ఇందులో భాగంగా సర్వదర్శనానికి వచ్చే భక్తుల కోసం క్యూలైన్‌ను మార్పు చేసింది. ఇప్పటివరకు ఎంబీసీ-16 సమీపంలో ఉన్న సర్వదర్శనం ప్రవేశద్వారాన్ని లేపాక్షి ఎంపోరియం ఎదుటకు మార్చింది. ఇక.. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల విడుదలను తిరుమలలో ఆపివేసి తిరుపతిలోని కౌంటర్లలో మాత్రమే జారీ చేస్తోంది.