పట్టుబడిన 1381 కేజీల బంగారంపై టీటీడీ క్లారిటీ..

పట్టుబడిన 1381 కేజీల బంగారంపై టీటీడీ క్లారిటీ..

ఎన్నికల సమయంలో తమిళనాడు 1,381 కిలోల బంగారం పట్టుబడడం సంచలనమైంది. ఆ బంగారం టీటీడీకి చెందినగా డ్రైవర్లు చెప్పినా.. చెన్నైలోని వెప్పంపట్టు దగ్గర వాహనంలో పట్టుబడిన 1,381 కిలోల బంగారాన్ని ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌.. పూందమల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. మొత్తానికి ఇది టీటీడీకి చెందిన బంగారంగా నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఈ ఘటనపై స్పందించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. 8500 కేజీల బంగారాన్ని ఆంధ్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లలో డిపాజిట్ చేశామని.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన 1,381 కేజీల బంగారం 20 రోజుల క్రితం మెచ్యూరిటీ తీరిపోవడంపై.. ఆ బంగారాన్ని టీటీడీ ట్రెజరీకి చేర్చాలని బ్యాంకుకు లేటర్ ఇచ్చామని తెలిపారు ఈవో... ఎలక్షన్ తనిఖీల్లో పట్టుకున్న బంగారం టీటీడీదేనని ధృవీకరించారు. ఎలక్షన్ తనిఖీలలో పట్టుకున్న బంగారాన్ని విడిపించేందుకు టీటీడీ ఇచ్చిన లేఖతో తమిళనాడుకు బయల్దేరి వెళ్లారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ తో మాట్లాడారు బ్యాంకు అధికారులు.