రమణదీక్షితులుకు టీటీడీ కౌంటర్

రమణదీక్షితులుకు టీటీడీ కౌంటర్

అర్చకుల వయోపరిమితి వివాదంపై స్పందించారు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్... ప్రభుత్వ జీవోలు, కోర్టు ఆదేశాల ప్రకారమే 65 ఏళ్ల వయోపరిమితి విధించామని తెలిపారు. మీరాశి అర్చకులకు ఎక్కడా అన్యాయం జరగడంలేదని... అదే కుటుంబానికి చెందినవారిని అర్చకులుగా నియమిస్తున్నామని ఈవో స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈవో... శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు, పూజలు.. శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని వెల్లడించారు. 

శ్రీవారి నగలన్నీ భద్రంగా ఉన్నాయని అన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్... గతంలో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీలు అన్నీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయని చెప్పారు. 1952 తిరువాభరణ రిజిస్ట్రార్ నోట్‌లో నోట్‌ చేసిన నగలన్నీ భద్రంగా ఉన్నాయని కమిటీలు సంతృప్తి వ్యక్తం చేశాయని... ఆరోపణల్లో వాస్తవం లేదని గుర్తు చేశారు ఈవో. 1971 నుంచి సుప్రభాత సేవ ఉదయం 3 గంటలకే ప్రారంభం అవుతుందన్నారు ఈవో... ఆలయంలో రహస్యంగా ఏమీ జరగడంలేదన్నారు. నిబంధనల ప్రకారమే టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోందని... రమణ దీక్షితులు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారాయన.  2012లోనే అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి అమలులోకి వచ్చిని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈవో.