టీటీడీ జేఈవో నియామకానికి ఉత్తర్వులు

టీటీడీ జేఈవో నియామకానికి ఉత్తర్వులు

తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా ఏవీ ధర్మారెడ్డిని ప్రభుత్వం నియమించింది. కేంద్ర హోంశాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ధర్మారెడ్డి ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆయణ్ను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనికి కేంద్రం ఇవాళ ఆమోద ముద్ర వేయడంతో ధర్మారెడ్డిని తిరుమల జేఈవోగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ధర్మారెడ్డి టీటీడీ జేఈవోగా పనిచేయడం ఇది మూడో సారి. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004 జులై 5 నుంచి 2006 సెప్టెంబరు 9 వరకు ఆయన ఇదే హోదాలో పనిచేశారు. రెండో విడత 2008 ఏప్రిల్‌ 2 నుంచి 2010 ఆగస్టు 31 వరకూ పని చేశారు.