టీటీడీ మరో కీలక నిర్ణయం: ఏకాంతంగానే నిర్వహణ..!
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉన్నది. ఈరోజు కేసులు కొద్దిగా తగ్గినా, రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నది. శీతాకాలం ప్రారంభం తరువాత కరోనా కేసులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పైగా వచ్చేది పండగ సీజన్ కావడంతో సమూహాలు పెరిగే అవకసం ఉన్నది. జాతర పేరుతో ఎక్కువమంది ఒకచోట గుమీకూడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నివారించేందుకు కేంద్రం సూచనలు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16 నుంచి 24 వరకు జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరకటించింది. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలోనిర్వహించే ఆగమోత్త కార్యక్రమాలన్నీ యథాతథంగా అలయంలోనే నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)