రమణ దీక్షితులకి నోటీసులు

రమణ దీక్షితులకి నోటీసులు

టీటీడీ పాలకమండలిపై తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధానార్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ స్పందించారు. బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రమణ దీక్షితులు చేసిన ఆరోపణల మీద నోటీసులు జారీ చేసి వివరణ కోరుతామన్నారు.. బ్యాంకులో డిపాజిట్ చేసిన టీటీడీ డిపాజిట్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి సబ్ కమిటీని నియమించామని ఛైర్మన్ తెలిపారు..

శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో.. చంద్రగిరిలోని కోదండ రామస్వామి ఆలయంలో ప్రతినెల పునర్వసు నక్షత్రం రోజున ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. జూన్ 5వ తేదిన టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇదే సమావేశంలో 65 ఏళ్లు పైబడిన అర్చకులు పదవి విరమణ చేయాలని బోర్డు తీర్మానించింది. ఇది అమల్లోకి వస్తే.. ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ మూర్తి దీక్షితులు తమ పదవులు కోల్పోనున్నారు.