శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

ఈ రోజు జూన్ మాసంకు సంభందించిన 63,804 ఆర్జిత సేవా టిక్కెట్లును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్ లైన్ లో విడుదల చేసింది. లక్కి డిప్ విధానంలో 10,129 టిక్కేట్లు.. జనరల్  కేటగిరిలో 53,675 సేవా టిక్కెట్లును టీటీడీ విడుదల చేసింది. ప్రభాత సేవకు 7,924, తోమాల 120, అర్చన 120 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. స్వామివారి అష్టదళ పాదపద్మారాధానకు 240  టికెట్లు, నిజపాద దర్శనం కోసం 1,725 టికెట్లను విడుదల చేశారు. అలాగే విశేష పూజకు 1,000 టికెట్లు.. కళ్యాణోత్సవంకు 13,775 టికెట్లు.. ఊంజల్ సేవ కింద 4,350.. ఆర్జిత బ్రహ్మోత్సవం కింద 8,250 టికెట్లు.. వసంతోత్సవం కింద 7,700 టికెట్లు.. సహస్ర దీపాలంకరణ సేవ కింద 18,600 టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఈఓ సింఘాల్ మాట్లాడుతూ... హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని శ్రీవారి ఆలయానికి మార్చి 8న అంకురార్ఫణ, 13వ తేదిన విగ్రహ ప్రతిష్ట చేస్తాం అని తెలిపారు. ఏఫ్రిల్ 13 నుండి 21 వరకు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు, 18వ తేదిన సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి మాసంలో 18.87 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. హుండి ద్వారా 83.11 కోట్లు  ఆదాయం లభించింది. 82.06 లక్షల లడ్డులు భక్తులుకు అందించాం అని ఈఓ తెలిపారు.