అలిపిరి వద్ద భక్తులపై టీటీడీ సెక్యూరిటీ దాడి

అలిపిరి వద్ద భక్తులపై టీటీడీ సెక్యూరిటీ దాడి

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తులపై, సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు. తమిళనాడుకు చెందిన 45మంది భక్త బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతికి వచ్చారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నారాయణస్వామి అనే భక్తుడు చేతిలో గుట్కా ప్యాకెట్ ను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది. కొండపైకి గుట్కా ప్యాకెట్ తీసుకెళ్ళకూడదని చెప్పాడు. నారాయణస్వామి గుట్కా ప్యాకెట్ ను కిందపడేసి లగేజ్‌ను చెక్ చేయించుకుని వెనక్కి వచ్చి మళ్ళీ గుట్కా ప్యాకెట్‌ను తీసుకున్నాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది నారాయణస్వామి చేతిలో ఉన్న గుట్కా ప్యాకెట్‌ను లాక్కొనబోతే, గుట్కా ప్యాకెట్ ఇవ్వకుండా సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది నారాయణ స్వామిపై దాడి చేశారు.