శ్రీవారి భక్తులకి శుభవార్త !

శ్రీవారి భక్తులకి శుభవార్త !

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు త్వరలో శుభవార్త చెప్పబోతోంది టీటీడీ.  వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు తెరిచి ఉంచాలని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం  వైకుంఠ ఏకాదశి, ద్వాదశ పర్వదినాల్లో మాత్రమే భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం లభిస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో వైకుంఠ ద్వారాలు తెరవాలని టీటీడీ భావిస్తోంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాల ద్వారా భక్తులను అనుమతించేందుకు ఆగమ సలహా మండలి కూడా అనుమతిచ్చింది.  పాలకమండలి ఆమోదం పొందితే  ఈ ఏడాది నుంచే నూతన విధానం అమలులోకి రానుంది.