అప్పుల తెలంగాణగా ఎందుకు మార్చారు..

అప్పుల తెలంగాణగా ఎందుకు మార్చారు..

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా ఎందుకు మార్చారని టీటీడీపీ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో అప్పును ఖర్చు చేయడంలేదని అన్నారు. తెలంగాణ రాబడిలో మొదటి స్థానంలో ఉంటే అభివృద్ధి ఎందుకు కనబడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఆ శాఖ కార్యదర్శి రామకృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టో లో చెప్పిన సంక్షేమ హామీలు .. ఆరునెలలు గడిచినా దిక్కులేదని మండిపడ్డారు.

'కాళేశ్వరం పై చూపుతున్న శ్రద్ద.. పెండింగ్ ప్రాజెక్టు లను ఎందుకు పట్టించుకోవడం లేదు. కమిషన్ ల కోసమే కాళేశ్వరం పై కేసీఆర్ ప్రేమ. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్న అన్ని ప్రాజెక్టులు గత ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. పాలన గాలికొదిలేసి ఏపీలో టీడీపీని దెబ్బతీయడం పైనే కేసీఆర్ పనిచేస్తున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లో జగన్ పనిచేస్తుంటే .. పర్యవేక్షణ ఢిల్లీ చేస్తుంది. అసెంబ్లీలో 105 స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీ .. టీడీపీ పైన విమర్శలా..? వీవీ ప్యాట్ లెక్కించాలంటే వైసీపీ, బీజేపీలు ఎందుకు భయపడుతున్నాయి. ఏపీలో టీడీపీ తప్పక అధికారంలోకి వస్తుంది. ఈసీ విశ్వసనీయతను నిలుపుకోవాలి. పారదర్శికత కోసమే ..వీవీ ప్యాట్ లను ముందే లెక్కించాలంటున్నాం. జగన్ ను ఆదర్శంగా తీసుకుంటే.. చంచల్ గూడ నుండి డిగ్రీలు వస్తాయి' అని రావుల చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.