'కంటి వెలుగు' బాధితులను పరామర్శించిన ఎల్.రమణ

'కంటి వెలుగు' బాధితులను పరామర్శించిన ఎల్.రమణ

కంటి వెలుగు కార్యక్రమంలో ఇన్ఫెక్షన్లు సోకి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో నిర్వహించిన కంటి శుక్లాల ఆపరేషన్లు వికటించింది. వరంగల్ జిల్లా హన్మకొండలోని జయ ఆసుపత్రిలో ఇటీవల ఒకేరోజు 19 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు నిర్వహించారు. అందులో 18 మందికి ఇన్ఫెక్షన్లు సోకింది. వెంటనే వారిని హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అప్పటి వరకు ఆపరేషన్లు చేయొద్దంటూ జయ ఆస్పత్రికి నోటీసులు ఇచ్చారు.