రజనీకాంత్‌కు జరిగినట్టే తుమ్మలకు కూడా..!

రజనీకాంత్‌కు జరిగినట్టే తుమ్మలకు కూడా..!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఎడమ.. కుడి అయ్యింది. నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో స్థానిక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి 28వ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. ఐతే.. ఎన్నికల సిబ్బంది తుమ్మల ఎడమ చేతి వేలికి బదులుగా కుడిచేతి వేలికి సిరా గుర్తు వేశారు. గత నెలలో తమిళనాడులో జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో సినీనటుడు రజనీకాంత్‌ కుడిచేతి వేలికి సిరా గుర్తు వేసి అక్కడి సిబ్బందిని అధికారులు సస్పెండ్‌ చేశారు. ఈసారి ఇక్కడి సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..