కరోనా కారణంగా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రముఖ గోల్ కీపర్...

కరోనా కారణంగా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రముఖ గోల్ కీపర్...

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ రావడం తో టర్కీ మాజీ గోల్ కీపర్ "రుస్తు రెక్బర్" ఆసుపత్రికి తరలించబడ్డాడు. ప్రస్తుతం "క్లిష్టమైన పరిస్థితుల్లో " ఉన్నాడు అని అతని భార్య తెలిపింది. రెక్బర్ భార్య "మేము నా భర్త రుస్తును కరోనా నిర్ధారణ పరీక్షా కోసం ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ వైరస్ తనకు రావడం తో మేము ఇంకా షాక్‌లో ఉన్నాము" అని రెక్బర్ భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. అయితే ముందు జాగ్రత్త కొద్దీ తనకు అలాగే తమ ఇద్దరు పిల్లలకు అని రకాల పరీక్షలు చేసినట్టు తెలిపింది. అలాగే తన భర్త ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నారని, వారిని చూడటానికి వైద్యులు తమను అనుమతించలేదని తెలిపింది. 120 అంతర్జాతీయ ప్రదర్శనలలో పాల్గొన్న టర్కీ యొక్క అత్యధిక క్యాప్డ్ ఆటగాడు రుస్తు, 2002 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం లో తానే ముఖ్యపాత్ర వహించాడు. అక్కడ అతను ఒక దశాబ్దానికి పైగా ఆడాడు. 46 ఏళ్ల రుస్తు 2012 లో ఆట నుండి రిటైర్ అయ్యాడు.