వడ్డీ 24 శాతానికి పెంచారు

వడ్డీ 24 శాతానికి పెంచారు

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కరెన్సీ సంక్షోభానికి కారణమైన టర్కీలో చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంది. తమ కరెన్సీ లిరా మరింత పతనం కాకుండా ఉండేందుకు అమెరికా నుంచి కొన్ని రకాల వస్తువుల దిగుతులు కూడా ఆపేసిన టర్కీ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలపై వడ్డీని (రెపో రేటు) ఏకంగా 24 శాతానికి పెంచేసింది. ప్రస్తుతం 17.75 శాతం వసూలు చేస్తోంది. లిరా కరెన్సీ మరింత క్షీణించకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు టర్కీ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఈ వార్తలు వెలువడిన వెంటనే కరెన్సీ మార్కెట్ లో లిరా 5 శాతం పెరిగింది.