ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు

ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల అదుపులో ఝాన్సీ ప్రియుడు సూర్య పలువురి పేర్లను ప్రస్తావించాడు. బాబీ, గిరి అనే ఇద్దరు వ్యక్తులు ఝాన్సీకి ఫోటో షూట్ చేసే వారని తెలిపాడు. వారిని నమ్మవద్దని పలుమార్లు ఝాన్సీకి చెప్పాని అన్నాడు. ఈ ఇద్దరు ఝాన్సీకి సినిమాల్లో అవకాశం కల్పిస్తామని మోసం చేశారని పోలీసుల విచారణలో సూర్య తెలిపాడు. గిరి తనను పలుమార్లు ఇబ్బంది పెట్టినట్లు ఝాన్సీ చెప్పిందని అన్నాడు. గిరికి ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చానని సూర్య పోలీసులకు తెలిపాడు. సినిమా అవకాశాలు రాకపోవడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని సూర్య అన్నాడు. పోలీసుల విచారణలో బాబీ, గిరి పేర్లు రావడంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది.