ముగిసిన రవిప్రకాష్ వాదనలు...

ముగిసిన రవిప్రకాష్ వాదనలు...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు.. ఉదయం ఈ కేసులో రవిప్రకాష్ తరపు వాదనలు విన్న హైకోర్టు.. మధ్యాహ్నం ప్రభుత్వ వాదనలు వింటామని పేర్కొంది. కాగా, టీవీ9 వ్యవహారంలో కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాష్.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఫోర్జరీ, నిధుల దారి మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా, రవిప్రకాశ్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. రవి ప్రకాష్‌ ను అరెస్టు చేయాలని వస్తే.. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే 41ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవి ప్రకాష్ కు ఆదేశించింది. జూన్ 10న ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసువాలని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పోలీసు విచారణకు హాజరయ్యారు రవిప్రకాష్‌.