జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం ట్వీటారో తెలుసా?

జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం ట్వీటారో తెలుసా?

జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన పిక్ ను పోస్ట్ చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న ఫలితాలు రావడం లేదని భావించారో ఏమో గానీ... సిటీ ప్రజలు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ దాని ప్రాధాన్యాన్ని గుర్తించాలని భావించి.. ఈ పిక్ ను పోస్టు చేసి ఉంటారు. ముంబై నగరంలోని ఓ పాత గోడ మీద రాసి ఉన్న మాటల్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. అందులో ఏముందంటే... (Educated people are throwing garbage on street. Uneducated people are cleaning them) చదువుకున్నోళ్లంతా వీధుల్లోనే చెత్తను గుమ్మరిస్తుంటే.. ఏమీ చదువుకోనివాళ్లు దాన్ని క్లీన్ చేస్తున్నారు.. అని. ఆ ఫొటోకు ఆయన ఏం కామెంట్ చేశారంటే... చదువుకున్నోళ్లను మనం ఎడ్యుకేట్ చేయగలమా? అని. మొత్తానికి కమిషనర్ ట్వీట్.. చదువుకున్నోళ్లను ఎడ్యుకేట్ చేసేందుకే ఆ పిక్ పోస్ట్ చేశారని అర్థం చేసుకోవచ్చు.