శ్రీకాకుళం జిల్లాలో దారుణం... సొంత అన్నను, అక్కను చంపిన తమ్ముడు

శ్రీకాకుళం జిల్లాలో దారుణం... సొంత అన్నను, అక్కను చంపిన తమ్ముడు

శ్రీకాకుళం జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. సొంత అన్న, అక్కను నరికి చంపాడో వ్యక్తి. కొవ్వాడలోని రామచంద్రాపురం గ్రామంలో ఈ హత్యలు జరిగాయి. కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం... ఇచ్చిన నష్టపరిహారం విషయంలో అన్నదముళ్లైన.... గొర్లె సన్యాసిరావు, రామకృష్ణ మధ్య వివాదం చెలరేగింది. మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. పట్టలేని ఆగ్రహంతో తమ్ముడు రమకృష్ణ... అన్నను కత్తితో పొడిచి చంపాడు. అడ్డువచ్చిన అక్క జయమ్మను కూడా హతమార్చాడు.