ఆస్పత్రిలో చేరిన సీఎం కుమారస్వామి..!

ఆస్పత్రిలో చేరిన సీఎం కుమారస్వామి..!

కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. శాసనసభలో రేపు విశ్వాసపరీక్ష జరగనుండగా.. కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. హైబీపీ కారణంగా కుమారస్వామి ఆస్పత్రిలో చేరారని జేడీఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ స్పందించింది. విశ్వాస పరీక్షలో ఓడిపోతారని తెలిసే కుమారస్వామి కొత్త డ్రామాలాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కుమారస్వామి ఓ గంటపాటు అసెంబ్లీకి వస్తే చాలని వారు అంటున్నారు. ఇక.. కుమరస్వామి సర్కర్‌కు రేపు చివరి రోజున బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప అన్నారు. మరోవైపు.. రేపటి విశ్వాసపరీక్షకు దూరంగా ఉండాలని రెబెల్స్‌ నిర్ణయించినట్టు తెలిసింది.