మూడేళ్లుగా జీతం తీసుకోని ట్విట్టర్‌ సీఈవో...!

మూడేళ్లుగా జీతం తీసుకోని ట్విట్టర్‌ సీఈవో...!
ఓ కంపెనీకి సీఈవో అయితే ఆ సంస్థను బట్టి లక్షల్లో... కోట్లలో జీతం పొందుతుంటారు... కానీ, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్ల అభిమానాన్ని చురగొన్న ట్విట్టర్ సీఈవో మరియు సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే జీతమే తీసుకోవడం లేదట. ఓ నెలో రెండు నెలలు కాదు... వరుసగా మూడేళ్లుగా ఆయన నెలసరి వేతనమే తీసుకోవడం లేదు. 2015, 2016, 2017లోనూ ఆయన జీతం తీసుకోలేదని తెలుస్తోంది. మైక్రోబ్లాగ్ ఫ్లాట్‌ఫామ్‌ను నడిపిస్తున్న జాక్... తన ఉద్యోగానికి తగ్గ రెమ్యూనరేషన్ తీసుకోలేదట. అయితే, ఆయనకు కంపెనీలో షేర్లు ఉన్నాయి. షేర్ల విలువ ట్విట్టర్‌లో 20 శాతం మేర ఉంది. ట్విట్టర్‌లో ఆయనకు 18 మిలియన్ల షేర్ల వరకు ఉన్నాయట... వీటి విలువ సుమారు 529 మిలియన్ల డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా... షేర్ల రూపంలోనే మిలియన్ డార్లు సంపాదిస్తున్నాడుగా... ఇక వేతనం ఎందుకులే అనుకున్నాడేమో మరి. ట్విట్టర్... యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌లో దాఖలు చేసిన ప్రాపర్టీ స్టేట్‌మెంట్‌ను బట్టి... 2017లో జాక్ డోర్సే వేతనం తీసుకోలేదని తెలిపింది. ఇక ట్విట్టర్‌ ప్రపంచవ్యాప్తంగా 330 మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను కలిగిఉంది. మరోవైపు కంపెనీ తన అదృష్టాన్ని పునరుద్ధరించడానికి ప్రస్తుతం కొన్ని ప్రధాన సవరణలు చేస్తోంది. అయితే జాక్ డోర్సే వేతనం తీసుకోకున్నా వ్యక్తిగత మరియు గృహ అవసరాల కోసం 68,506 డాలర్లు తీసుకున్నట్టు ట్విట్టర్ పేర్కొంది.