పార్లమెంటరీ కమిటీ ముందు హాజరుకాలేము

పార్లమెంటరీ కమిటీ ముందు హాజరుకాలేము

ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ అంశంపై పార్లమెంట‌రీ క‌మిటీ ముందు హాజ‌రుకాలేమ‌ని ట్విటర్ సీఈవో,  ప‌లువురు అధికారులు తేల్చి చెప్పారు. బీజేపీ ఎంపీ అనురాగ్‌ థాకూర్ నేతృత్వంలో సోష‌ల్ మీడియాలో పౌర హ‌క్కుల ర‌క్షణ కోసం భార‌త ప్రభుత్వం పార్లమెంట‌రీ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కమిటీ ముందు హజరుకావాలని ఈనెల 1న థాకూర్ సమన్లు జారీ చేశారు. ఈనెల 7న సమావేశం జరగాల్సి ఉంది. కానీ 11కు వాయిదా వేశారు. నోటీసు వ్యవ‌ధి 10 రోజులు మాత్రమే ఉన్న కార‌ణంగా.. హాజ‌రుకాలేక‌పోతున్నామ‌ని ట్విటర్ పేర్కొంది. ట్విటర్ కోసం భారత్ లో ప్రత్యేక నియ‌మావ‌ళిని రూపొందించ‌లేదని న్యాయ విభాగానికి చెందిన విజ‌య గద్దె ఓ లేఖ‌లో తెలిపారు. ట్విటర్ ఇండియా బాధ్యతలు చూసే వారెవరికీ దేశ చట్టాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని తెలిపింది. పార్లమెంటరీ కమిటీ ముందుకు ట్విటర్‌ తరఫున జూనియర్‌ ఉద్యోగులను పంపలేమని విజయ ఆ లేఖలో పేర్కొంది.