ఈ జీన్స్ చూసి..

ఈ జీన్స్ చూసి..

చిరిగిన జీన్స్‌(టార్న్‌ జీన్స్‌) ఇప్పుడో ఫ్యాషన్‌. యూత్‌లో ఇదో ట్రెండ్‌. 'చిరిగిన జీన్స్‌' అంటూ తెలుగు సినిమాలో ఓ పాట కూడా ఉందంటే యూత్‌ను ఈ తరహా జీన్స్‌ ఎంతగా ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్ని మోడళ్ల టార్న్‌ జీన్స్‌ చూస్తే 'ఇలాంటి జీన్స్‌ కూడా ఉంటుందా.. ఇదీ జీన్సేనా!' అనిపిస్తుంటుంది. అటువంటి జీన్స్‌నే లాస్‌ఏంజెల్స్‌కు చెందిన ఓ కంపెనీ విడుదల చేసింది. రెండు జేబులు.. నాలుగు తాళ్లు.. తరహాలో ఉంటే ఈ కటౌట్‌ జీన్స్‌ను చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ధర ఏకంగా రూ.11 వేలు ఉండడంతో ముక్కున వేలేసుకున్నారు. జీన్స్‌ ఫొటోను చూసీచూడగానే 'సంస్థ'ను ఓ ఆటాడుకున్నారు. బీచ్‌లో స్నానానికి ఈ జీన్స్‌ను మించింది లేదని ఒకరు, హమ్మయ్య.. జేబులైనా ఇచ్చారు సంతోషం అని మరొకరు, నేను చూస్తున్నది నిజమేనా? అని ఇంకొకరు ట్వీట్లు చేసి ఈ కటౌట్ జీన్స్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ఫ్యాషన్‌ అంటే కంఫర్ట్‌గా ఉండాలి.. అంతేగాని ఇలా అసహ్యంగా ఉండకూడదని అంటూ ట్వీట్లు మీద ట్వీట్లు చేస్తున్నారు.

Untitled-1 copy