జైషే మహమ్మద్ చీఫ్ కు గాయాలు?

జైషే మహమ్మద్ చీఫ్ కు గాయాలు?

పాకిస్తాన్‌లోని రావల్పిండి మిలటరీ ఆస్పత్రి వద్ద జరిగిన భారీ బాంబు పేలుడులో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ గాయపడినట్టుగా భావిస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మసూద్‌ అజర్‌ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్‌ పెదవివిప్పడం లేదు. మరోవైపు భారత నిఘా సంస్ధలు సైతం ఈ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించలేదు. బాంబు పేలుడులో మొత్తం 10మంది గాయపడగా.. అందులో మసూద్ అజర్ కూడా ఉన్నాడని ట్విట్టర్‌లో కొంతమంది పేర్కొన్నారు. పేలుడు ఘటన అనంతరం అక్కడి పరిస్థితులను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాను పోలీసులు అనుమతించలేదు.