'న్యూస్‌ ట్వీట్స్‌'తో టైమ్‌ సేవ్‌

'న్యూస్‌ ట్వీట్స్‌'తో టైమ్‌ సేవ్‌

 
యూజర్లకు మరో లేటెస్ట్‌ ఫీచర్‌ను ట్విటర్‌ అప్‌డేట్‌ చేసింది. ప్రతిరోజూ ఎంతో మంది న్యూస్‌ లింక్స్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. మనం టైమ్‌ లైన్‌ స్ర్కోల్‌ చేస్తూ ఈ లింక్స్‌ను చూస్తుంటాం. ఇలా స్క్రోల్‌ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ముఖ్యమైన లింక్స్‌ను మిస్‌ అవుతుంటాం. అందుకే.. ఇకపై న్యూస్‌ లింక్స్ ఉన్న ట్వీట్స్‌ హైలైట్‌ అయ్యే విధంగా ట్విటర్‌.. వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసింది. అలాగే.. ఒకే అంశానికి సంబంధించిన న్యూస్‌ లింక్స్‌ను ఒకరి కంటే ఎక్కువ మంది షేర్‌ చేస్తే.. ఆ లింక్స్‌ అన్నీ కలిసి 'త్రెడ్‌'గా ఒకే వరుసలో కనిపిస్తాయి. ఈ ఫిచర్‌ యూజర్లకు కచ్చితంగా టైమ్‌ సేవ్‌ చేస్తుందనడంలో సందేహం లేదు.