గుంటూరు  సహకార బ్యాంకులో కరోనా కలకలం... అప్రమత్తమైన అధికారులు... 

గుంటూరు  సహకార బ్యాంకులో కరోనా కలకలం... అప్రమత్తమైన అధికారులు... 

కరోనా ఎవరిని వదలడంలేదు.  ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న కరోనా ఇప్పుడు బ్యాంక్ లను సైతం వణికిస్తోంది.  బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందిని కరోనా ఇబ్బందులు పెడుతున్నది.  పబ్లిక్ తో సంబంధాలు ఎక్కువగా ఉండే పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ ల్లో అధికారులు అప్రమత్తంగా ఉంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఏదో విధంగా కరోనా ఎంటర్ అవుతూనే ఉన్నది.  

ఇక గుంటూరులో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.  అయితే, లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో బ్యాంకులు పనిచేస్తున్నాయి.  అయితే, బ్యాంకుల్లో పనిచేసే వ్యక్తులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు.  గుంటూరులోని సహకార బ్యాంకులో పనిచేస్తున్న ఇద్దరికి కరోనా సోకింది.  ఇద్దరు అటెండర్లకు కరోనా పాజిటివ్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  వెంటనే బ్యాంక్ ను శుద్ది చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.  బ్యాంక్ లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఇప్పుడు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.