ఎన్‌టీఆర్30 సినిమాకి బంపర్ ఆఫర్..?

ఎన్‌టీఆర్30 సినిమాకి బంపర్ ఆఫర్..?

యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఎన్‌టీఆర్ ఆర్ఆర్ఆర్ ముగించుకున్న వెంటనే ప్రారంభం అవుతోంది. త్రివిక్రమ్ ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశారు. ఎన్‌టీఆర్ రెడీ అంటే వెంటనే సినిమాను ప్రారంభించేస్తారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దాదాపు వచ్చే నెల చివరికి ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో పట్టాలెక్కవచ్చు. అయితే ఈ సినిమా ఎన్‌టీఆర్30గా ప్రచారం అవుతోంది. కాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఇప్పటి నుంచే పోటీ మొదలైంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకునేందుకు రెండు బడా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఒకటయ్యాయి. సినిమా నిర్మాతలకు కాదనలేని స్థాయి ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తరువాత ఇండస్ట్రీకి ఆల్‌టైమ్ హిట్ అలా వైకుంఠపురములో సినిమా ఇచ్చిన త్రివిక్రమ్, ఆర్ఆర్ఆర్ హీరో ఎన్‌టీఆర్ సినిమా కావడంతో కచ్చితంగా భారీ వసూళ్లు చేస్తుందని, కాబట్టి ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను చేజారనివ్వకూడదన్న ఆలోచనతో వారు భారీ ఆఫర్‌తో వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తేలాల్సి ఉంది.