ఓఆర్‌ఆర్ పై రెండు కార్లు ఢీ, ఇద్దరు మృతి

ఓఆర్‌ఆర్ పై రెండు కార్లు ఢీ, ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుక్కుగూడ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతులు యాచారం వాసులు మాధవరెడ్డి, రఘుమారెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.